రాయల్ పోస్ట్ హైదరబాద్ : TRS దళిత MLA లారా దళిత బంధు కోసం రాజీనామా చెయ్యండి. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా కాంగ్రెస్ నుంచి పోటి లేకుండా అధిష్టానాన్ని ఒప్పిస్తాం.
ఈరోజు గాంధి భవన్ లో దళిత కాంగ్రెస్ చర్మాన్ నాగరిగారి ప్రీతం కాంగ్రెస్ వికలాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్యతో కలిసి మీడియా తో మాట్లాడారు.

నవంబర్ 4 వ తారీఖు నుండి రాష్ట్రంలో దళిత బంధు అమలు చేస్తానని ఎన్నికలకు రెండు రోజుల ముందు చెప్పిన ముఖ్యమంత్రి ఏడికిపోయిండు?

నవంబర్ 4 వ తారీఖు పోయి జనవరి 4 వచ్చే, ఇంతవరకు దళితతబందు ఊసే లేదు..

రాష్ట్రంలో ఇప్పటికీ ఎస్సి కార్పొరేషన్ లోన్స్ విడుదల కావాల్సిఉండగా ,, ఈ దరిద్రుల పాలనలో ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ కు చెక్కు మీద సంతకం పెట్టే అధికారం కూడా లేదు… ఏమి ఈ దరిద్రం తెలంగాణాకు?

రాష్ట్రం లో కొత్తగా G.O 317 తీసుకొని వచ్చిండ్రు, ఈ G O పైరవీ కారులు మాత్రమే ఉపయోగిస్తున్నారు. పైరవీ చేసుకోలేని దళిత ఉద్యోగుల పరిస్థితి ఏమిటి?
317 G.O పేరు మీద దళిత ఉద్యోగస్తులను స్థానికంగా పని చెయ్యకుండా 100 కిలోమీటర్ల పైన బదిలీ చేసిండ్రు.

కుటుంబాలకు దూరమై ఉద్యోగాలు చేస్తున్న వారందరికీ తెలంగాణ దళిత కాంగ్రెస్ పిలుపునిస్తుంది, మీరందరూ కలిసి రండి మాతో పాటు ఉద్యమం లో పాల్గొనండి. మీకు అండగా తెలంగాణ దళిత కాంగ్రెస్ ఎల్లవేళలా మీ వెన్నంటి ఉంటుంది.

1968 లో ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం ఏ రకంగా జరిగిందో ఆ రకంగా ముఖ్యమంత్రి పై పోరాటం చెయ్యాల్సిన అవసరం ఉంది.

రిజర్వుడు నియోజక వర్గాలలో గెలిచిన 18 దళిత ఎమ్మెల్యే లు మీకు చాతనైతే మీ మీ నియోజకవర్గాలలో దళిత బంధు ఇప్పించండి లేదా రాజీనామా చెయ్యండి.

దళిత బంధు విషయంలో మీరు రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కాళ్ళు పట్టుకోనైన సరే పోటీ లేకుండా మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది.

సంక్రాంతి దాటిన తెల్లారి నుంచి రాష్ట్రం లో దళిత బంధు అమలు కాకపోతే మీ ఎమ్మెల్యే లను రోడ్లపైన తిరగనియ్యం మిమ్మల్ని నిద్ర పోనియ్యం మీ మేడలు వంచే దాక మేము నిద్ర పోము…అని తెలంగాణ దళిత కాంగ్రెస్ హెచ్చరిస్తుంది.

పట్టపగలు దరిద్రుల పాలనలో మరొక దళిత యువతీ పరువు హత్య.

చెన్నూరు నియోజవర్గం లో 9 నెలల క్రితం సౌందర్య (దళిత యువతీ) మరియు రాళ్ళబండి సాయి కృష్ణ (మున్నూరు కాపు ) ప్రేమ వివాహం చేసుకున్నారు. జీర్నించుకోలేని సాయి కృష్ణ తండ్రి రాళ్ళబండి తిరుపతి ఆ యువతీ పై పగతో ప్రతీకారం తో రగిలి పోయి విద్వేష పూరిత కక్షతో కుట్ర పన్ని పట్ట పగలు నిన్నటి రోజున యువతీ ఇంట్లోకి చొరబడి యువతీ పై దాడికి యత్నిన్చంగా అడ్డువచ్చిన ఆమె తండ్రిని పొడిచి తదనంతరం ఆ యువతీ పై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేసి గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపినాడు. *“ఈ హత్యా ప్రతక్షంగా ప్రభుత్వం నిర్లక్షం చే చేయబడిన హత్యే”*

సౌందర్య తన భర్త చనిపోయిన అనంతరం రామగుండం కమిషనర్ పోలీస్ గారికి తనకు ప్రాణ హాని ఉందని వారి అత్తామామలు ( రాళ్ళబండి తిరుపతి, భార్య) పది మంది గుర్తు తెలియని వ్యక్తులను తీసుకు వచ్చి చంపుతామని బెదిరించినారని అక్టోబర్ లోనే పిర్యాదు చేసింది. స్థానిక MLA KCR భానిస “బాల్క సుమన్” వత్తిడి తో పోలీసులు ఈ కంప్లైంట్ ను నిర్లక్ష్యం చేసారని స్థానికులు మాట్లాడుకోడం యావత్తు దళిత జాతిని దిగ్బ్రాంతికి గురి చేసే సంఘటన వెంటనే స్పందించి ఉంటె ఇంత ఘోరం జరిగేది కాదు. దళిత జాతి భయందోలనకు గురి అయ్యేది కాదు ఈ నిర్లక్ష్యానికి కారణమైన పోలీస్ కమిషనర్ దగ్గర నుండి ఆ గ్రామ ఇంచార్జ్ పోలీస్ వరకు అందర్ని సస్పెండ్ చెయ్యాలి ఎస్సి ,ఎస్టి ఆక్ట్ ను వారి పై నమోదు చెయ్యాలి.ప్రభుత్వం వెంటటే ఆ కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేష్యియా చెల్లించాలి, మృత్యువుతో పోరాడుతున్న సౌందర్య తండ్రి కు KCR ట్రీట్మెంట్ చేయించుకున్న యశోద ఆస్పత్రి లో ప్రబుత్వ కర్చులతో ట్రీట్మెంట్ చేయించాలి. KCR వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించాలి లేకపోతేయ్ KCR ను దళిత ద్రోహిగా ప్రతి దళిత వాడలో దండోరా మోగిస్తాం.