రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ భువనగిరి /భువనగిరి పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలి అలాగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని గత 55 వారాలుగా నిర్వహిస్తున్న జ్ఞాన మాల ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని చౌరస్తాలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసిన నమస్కరించి నా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి . మన ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని,మన దేశం అభివృద్ధి పథంలో ముందడుగు వేయడానికి బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎంతో దోహదపడుతుందని తెలియజేశారు, కరెన్సీ నోట్లపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటం ముద్రించే ఉద్యమాని ముందుకు తీసుకెళ్తున్న ఉద్యమ నాయకులకు అభినందలు తెలియజేస్తూ, తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తెలియజేశారు…