రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: ఇందుమూలంగా భువనగిరి టౌన్
లోని ప్రజలకు, రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు, స్కూల్స్ మరియు కాలేజ్ యజమానులకు, దేవాలయాలు, మసీదులు మరియు చర్చి ల యొక్క పెద్దలకు తెలియజేయడమేమనగా
covid 19 (ఒమిక్రాన్) వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటం వలన గవర్నమెంట్ ఇచ్చిన G.O.MS.No.1 ప్రకారంగా ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిషేధించడమైనది కావున ప్రభుత్వం యొక్క ఉత్తర్వులను పాటించాల్సిందిగా కోరుతున్నాము.
లేనియెడల డిజాస్టర్ మేనేజ్ మెంట్ Act 2005 ప్రకారం వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోబడును స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భువనగిరి టౌన్ పి ఎస్ తెలిపారు.