రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ వలిగొండ / రైతు ఖాతాల్లోకి సర్కారు సాయం సాగుకు ఉపయోగించుకోవాలని సూచన ఆనందంలో భువనగిరి నియోజకవర్గం రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం
రైతన్న ఇంటికి పెట్టుబడి సాయం చేరుతున్నది. యాసంగి సాగుకు సిద్ధమైన తరుణంలోనే రైతుబంధు అందుతున్నది.గత మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసి, సీఎం కేసీఆర్‌ పేరిట సెల్‌ఫోన్లకు మెస్సేజ్‌లు పంపిస్తుండడంతో రైతులు ఆనందంలో మునిగిపోతున్నారు. సీజన్‌ ప్రారంభంలో పెట్టుబడికి రైతు బంధు అందుతుండడంతో సంబురపడుతున్నారు. భువనగిరి నియోజవర్గం లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. 2018లో ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటికే 7సార్లు సాయం అందించారు. 8 వ సారి నగదు పంపిణీ మంగళవారం నుండే రైతుల ఖాతాలో పడటం ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో 10 లక్షల 74 వేల,110 మంది రైతులు,యాదాద్రి జిల్లా లో 2.43 లక్షల మంది రైతులు ఉండగా, ప్రాధాన్యతా క్రమంలో ఎకరంలోపు ఉన్న రైతుల ఖాతాల్లో ముందుగా జమచేస్తున్నారు…