బండి సంజయ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సంజయ్‌ సహా కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్‌, పుప్పాల రఘు, కాచు రవి, మర్రి సతీశ్‌కు ఈనెల 17 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జాగరణ దీక్ష సందర్భంగా జరిగిన ఉద్రిక్తత ఘటనలపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. రెండో ఎఫ్‌ఐఆర్ ఆధారంగా సంజయ్‌కి కోర్టు రిమాండ్ విధించింది. సంజయ్‌పై ఉన్న 10 పాత కేసులను రెండో ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. దీనిపై ఆయన తరఫు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిన్నటి ఘటనలో 11 మంది పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు.