రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతున్న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని భువనగిరిలో ఏర్పాటు చేయడంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఘోరంగా వైఫల్యం చెందారని పిసిసి మాజీ కార్యదర్శి తంగళ్ళపల్లి రవికుమార్ విమర్శించారు. భువనగిరి లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాం ఏర్పాటు కోసం విశ్వకర్మ సంఘానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కోల్లోజు వెంకటాచారికి సోమవారం తంగళ్ళపల్లి రవికుమార్ లక్ష రూపాయలు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. అనంతరం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వెంకటాచారిని పూలమాల వేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా సావిత్రి పూలే జయంతి సందర్భంగా పట్టణంలోని జగదేవ్పూర్ చౌరస్తా వద్ద జ్యోతిరావు పూలే విగ్రహం ఎదుట సావిత్రి పూల చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ తన ముద్ర వేసుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నో వ్యూహాత్మక ఎత్తుగడలతో తెరవెనుక ఉండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫెసర్ జయశంకర్ ను అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులు మర్చిపోవడం సిగ్గుచేటన్నారు. బలహీన హోలీ నడిబొడ్డున వర్గాలకు చెందిన ప్రొఫెసర్ జయశంకర్ ను టిఆర్ఎస్ అగ్రకుల పాలకులు విస్మరించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. భువనగిరిలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే, నాయకులు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటుకు ముందుకు రాకపోతే విశ్వకర్మ సంఘం మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి నడిబొడ్డున ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కైరం కొండ వెంకటేష్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పచ్చర్ల హేమలత జగన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మజహార్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫీ, భువనగిరి మున్సిపల్ మాజీ కో-ఆప్షన్ సభ్యులు ముల్తానిషా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోట పెద్ద స్వామి, వల్లందాసు ఆదినారాయణ కాంగ్రెస్ నాయకులు రావుల నందు, పెంచికలపాడు మాజీ సర్పంచ్ అలయ్య , ఏనుగు ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.