రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: యాదాద్రిభువనగిరి జిల్లాకేంద్రంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారతదేశం తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 191వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన తెలంగాణ జర్నలిస్టు యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్.షానూర్ బాబా

ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జీ. వెంకన్న, మహిళా అధ్యక్షురాలు దేవరకొండ లావణ్య, ప్రచార కార్యదర్శి బైరాపాక సీరిల్, జిల్లా కార్యవర్గ సభ్యులు మహమ్మద్ అబ్దుల్ రెహమాన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.