హైదరాబాద్ నాంపల్లి లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా ఓ ఘటన చోటుచేసుకుంది.

నాంపల్లి రైల్వే స్టేషన్ ముందు చేతక్ పై వచ్చిన సజ్జాత్ అలీ ఖాన్ అనే వ్యక్తిని ట్రాఫిక్ పోలీసులు చెక్ చేశారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిపోయాడు… దీంతో పోలీసులు చేతక్ ని సీజ్ చేసారు.

తనకు వెహికిల్ కావాలని పోలీసులకు ఎంత మోర పెట్టుకున్నా వినకపోవడంతో మద్యం మత్తులో ఉన్న సజ్జాత్ అలీ ఖాన్ ఫ్రెష్టేషన్ లో అసహనానికి లోనై తన చేతక్ ను తానే తగలబెట్టాడు.

దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు… ట్రాఫిక్ పోలీసులు మంటలను ఆర్పేశారు.

దీంతో అతని పై నాంపల్లి లా అండ్ ఆర్డర్ పోలీసులు సెక్షన్ 70B కింద న్యూసెన్స్ కేసు నమోదు చేసారు.