రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో చదువుల తల్లి సావిత్రి భాయి 191వ జయంతి సందర్భంగా ఐద్వా పట్టణ కమిటి ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ శూద్ర కులంలో జన్మించి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా, పేద ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు, అంటరాని వారి విద్యాభివృద్ధికై కృషిచేసిన ఉద్యమ కారిణిగా, స్త్రీవిముక్తి పోరాట నాయకురాలిగా, కవయిత్రిగా, కులం, పితృస్యామ్యం అనే శక్తులపై యుద్ధానికి పూనుకున్న సాహసి సావిత్రిబాయి పూలే అని, తనకంటూ ఒక స్వతంత్ర వ్యక్తిత్వాన్ని నిర్మించుకుని వ్యవస్థపై తిరుగుబాటుకు బాటలు వేసిన తిరుగుబాటు బావుటా ఆమె అని కొనియాడారు. నేటికీ చాలామందికి ఆమె కేవలం జ్యోతిరావు పూలే భార్యగానే తెలుసు. ఆమె త్యాగం పోరాట పరిమ స్త్రీలకు, అంటరానివారికి ఆమె చేసిన సేవ, కృషి సరైన పద్ధతిలో వెలుగులోకి రాలేదు. నిజానికి ఆమె జీవితం గురించి ఎంతో విస్తృతస్థాయిలో ప్రచారం జరగాల్సి ఉందని, విప్లవకారుడైన తన భర్తతో సావిత్రిబాయి పూలే చేసిన పోరాటాలు, ఎదుర్కొన్న సమస్యలకు తగిన గుర్తింపు పొందకపోవడానికి కారణం సమాజంలో కులతత్వ, పురుషాహంకార ధోరణులేనని కారణం అన్నారు. సావిత్రి భాయి పూలే గారు అధిపత్యంపై చేసిన పోరాట స్పూర్తితో యువత, మహిళలు దేశవ్యాప్తంగా చిన్నారులు, యువతులు, మహిళలు, అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తిరుగుబాటు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మహిళలకు, అణగారిన వర్గాలకు విద్యను అందించాలనే సంకల్పంతో ఎన్ని ఆటుపోట్లు, అవాంతరాలు ఎదురైనా 52 పాఠశాలలు స్థాపించి మహిళలు, అణగారిన వర్గాల విద్యకు కృషి చేసిన సావిత్రి భాయి పూలే గారి జీవిత చరిత్ర ను పాఠ్యపుస్తకాలల్లో ముద్రించి భోదించాలని డిమాండ్ చేశారు.భువనగిరి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కల్లూరి నాగమణి దాసరి మంజుల దండు స్వరూప అంబటి లలిత బట్టుపల్లి జయశ్రీ భావన అనిత పావని రమ్య యుసిబాబి నాగరాని వసంత తదితరులు పాల్గొన్నారు.