రాయల్ పోస్ట్ ప్రతినిధి మంచిర్యాల: వి.ఎన్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ (తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ) ఆధ్వర్యంలో శనివారం రాత్రి జనవరి 01 .01.2022 హైదరాబాద్ ఆబిడ్స్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ లో సావిత్రిబాయి పూలే సేవా పురస్కారం 2022 ని తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి న్యూఢిల్లీ వేణుగోపాల చారి సి బి సి ఐ డి మాజీ జాయింట్ డైరెక్టర్ జె.డి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కేంద్రానికి చెందిన అభినవ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సంతోష్ కుమార్ అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ నీ ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా జెడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశం మనకు ఏమి ఇచ్చింది అనేది కాకుండా దేశానికి మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యమని యువతరం అంత కలిసి సమాజానికి ఏం చేయాలని అని ఆలోచిస్తే ముందుకు వస్తే ఈ శక్తి వారిని ఆపలేదని ఎవరైతే మన పట్ల కాకుండా సమాజం పట్ల ఆలోచిస్తేరో చరిత్రలో చిరస్థాయిగా ఉండి పోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వి.ఎన్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వల్లం నవీన్ కుమార్ , మాజీ డి.ఎస్.పి సుంకర సత్యనారాయణ ప్రముఖ సాహితీవేత్త కోయి కోటేశ్వరరావు విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ తాళ్లూరి సువర్ణ కుమారి అభినవ సేవా సంస్థ సభ్యులు పల్లెర్ల సాత్విక్ , కాసం ఆకాశ్ , కొంకుముట్టి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.