రాయల్ పోస్ట్ ప్రతినిధి మంచిర్యాల: మాజీ మంత్రి గడ్డం వినోద్ వెంకటస్వామి మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పోచంపల్లి హరీష్ అన్నారు.
గడ్డం వినోద్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యరు అనే అర్థం వచ్చేలా వాట్సాప్ సందేశాలు షేర్ చేస్తున్నారని
ఇది కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న పనిగా తాము భావిస్తున్నామన్నారు.గత ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో అనునిత్యం బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని మాజీ మంత్రి ప్రకటించారన్నారు. చెప్పినట్టుగానే నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటనలు చేస్తూనే, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారని అయన అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖచ్చితంగా పోటీ చేస్తారని, అంతేకాకుండా గతంలో ఏ ఎమ్మెల్యేకి ఇక్కడ లభించనంత భారీ మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టిస్తారని ధీమా వ్యక్తం చేశారు.