రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగనుపురస్కరించుకొని
క్రిస్టియన్ మైనారిటీ లకు మానవ హక్కుల పౌర సంబంధాల అధికారిని
ఇశ్రత్ జహాన్ ఆధ్వర్యంలో
ఐ ఏ ఎస్ తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మిసెస్ వెస్లీ కాంతి వారి సౌజన్యంతో స్థానిక పహాడినగర్ లోని హెబ్రోన్ చర్చి లో నూతన బట్టలను పంపిణి చేయడం జరిగింది.

ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరైన రాచకొండ కమిషనేరేట్ భువనగిరి ఏసీపీ వెంకట్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా క్రిస్టియన్ మైనారిటీ సోదర సోదరిమనులకు 75నిరుపేద కుటుంబాలకు నూతన బట్టలను పంపిణి చేయడం సంతోషకరమైన విషయం అని నేషనల్ హ్యూమన్ రైట్స్ వారు ఇక ముందు కూడా ఇలాంటి సేవ కార్యక్రమాలు చేయాలనీ అభినందించారు.అలాగే వక్ఫ్ బోర్డు మెంబర్ ఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ భువనగిరి ప్రజలందరి పైన ఏసు ప్రభువు దీవెనలు ఉండాలని ఈ నూతన సంవత్సరం లో అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో ఎండీ ఇస్తియాక్, TS తెరాస పార్టీ సీనియర్ లీడర్ ఉర్దూ అన్సారీ,
వై ఎస్ ఆర్ సీ పీ కో కన్వీనర్ ఎండీ అతహర్,పగిల్ల మాధవి,హుస్సేన్, mjf ప్రచార కార్యదర్శి b. సిరిల్ బాబు ఎం జే ఎఫ్ నాయకులు మత్యాస్ చర్చి ఫాదర్, రకీబ్ వాహేద్ తదితరులు పాల్గొన్నారు.