రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి,: రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించాలి
ఈనెల 9న GMC బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో జరగబోయే తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్ 18 యూత్ ఛాంపియన్షిప్ లో పాల్గొను యాదాద్రి భువనగిరి జిల్లా అండర్ 18 బాలబాలికల ఎంపికలు ఈరోజు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల( బాలురు) భువనగిరి మైదానంలో భువనగిరి ఉదయం 9.30 ని. లకు జిల్లా అధ్యక్షులు శ్రీ పోతంశెట్టి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రారంభమయినాయి. ఇట్టిపోటీలను వారు జెండాఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ ఎంపికకాబడిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో విజయం సాధించి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని జిల్లాకు మంచిపేరు తేవాలని కోరారు. తదుపరి అండర్ 18 సం// ల బాలబాలికలకు వేరువేరుగా 100, 200, 400 , 800, 1500, షాట్ ఫుట్, డిస్కస్ త్రో ల నందు బాల బాలికల విభాగాల్లో పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన అథ్లెట్స్ ను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఎంపికైన అథ్లెట్స్ యొక్క వివరాలు
18 సం. లోపు బాలికలు
నిఖిత 1500, మల్లిక 3000 చౌటుప్పల్, సుప్రియ షాట్ ఫుట్, అశ్విని 100 ఆలేరు, యశశ్విని షాట్ ఫుట్ వలిగొండ
18 సం. లోపు బాలురు
ఎం. రాకేష్800 తుర్కపల్లి, జశ్వంత్ 1500, మాదాపూర్, మనోజ్ షాట్ ఫుట్ తుర్కపల్లి, నగేష్ డిస్కస్ త్రో జలాల్పూర్ , సంజయ్ 400 , శ్రీను 400 మోత్కూర్, ప్రదీప్ 200 భువనగిరి, సేనాపతి 100 వసాలమర్రి.

రాష్ట్ర స్థాయి ఎంపిక కాబడిన అథ్లెట్స్ ఒరిజినల్ వయస్సు ధ్రువీకరణ పత్రం విధిగా సమర్పించాలి. RTPCR టెస్ట్ చేయించుకొని రిపోర్టుతో స్వంతంగా రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరుకావాలి. భోజన , రూమ్ వసతులు కల్పించబడవు(పూర్తిగా వ్యక్తిగతoగా చూసుకోవాలి) పోటీలు ( 9న) జరిగే రోజు ఉదయం 6గం. కి గచ్చిబౌలి లో రిపోర్ట్ చేయాలని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి గోపాల్ గారు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా కోశాధికారి గోనురు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు మాటూరి వినోద్, సంయుక్త కార్యదర్శి, ఎర్ర యాదగిరి గారు, NCC ఆఫీసర్ ఖాద్రి గారు, సాంకేతిక అధికారులు సాయికిరణ్, మల్లారెడ్డి, ప్రదీప్, సాయికుమార్, మహేష్, పవన్ కళ్యాణ్, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు , ఐలయ్య, కబీరుద్దిన్, నిర్మల, వేణు, కుమార్ , మల్లేష్, వ్యాయామ ఉపాధ్యాయులు రాజ్యవర్ధన్,లావణ్య, అజయ్, నవీన్, నిఖిల్, కౌశిక్, గణేష్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.