రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని స్థానిక లక్కీ ఫంక్షన్ హాల్ లో వినియోగదారుల హక్కుల సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా నూతన అధ్యక్షులుగా బోద్దుల నగేష్ మరియు కార్యవర్గం సభ్యుల సమావేశానికి ముఖ్యఅతిథిలుగా ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బీర్ల అయిలయ్య , ఆలేరు జడ్పిటిసి కుడుదుల నగేష్ , కల్లూరు రామచంద్రారెడ్డి హాజరయ్యారు. రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ నూతన కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన బోద్దుల.నగేష్ కు, నూతన కార్యవర్గాన్నికి శాలువాతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ కల్తీ లేని స్వచ్ఛమైన వస్తువులను కొరకు సమాజానికి తెలియపరుస్తూ అధిక రేట్లతో విక్రయిస్తే ప్రతి ఒక్కరం సంఘటితంగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, జనగాం జిల్లా అధ్యక్షులు , ఇతర 15 జిల్లాల అధ్యక్షులు, జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన నూతన సబ్యలు కార్యక్రమంలో పాల్గొన్నారు.