రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ / ఈనెల 3, 4 తేదీలలో భువనగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మి నరసింహ డిగ్రీ కాలేజీలో నిర్వహించబోయే జిల్లా స్థాయి సాంస్కృతిక, క్రీడల పోటీలు వాయిదా వేయడం జరిగిందని జిల్లా యువజన సంక్షేమ అధికారి ధనుంజయ తెలిపారు.కోవిద్ నిబంధనలను అనుసరించి సాంస్కృతిక కార్యక్రమాలను ఈనెల 10 వ తేదీ వరకు నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలు వెలువరించినందున ఇట్టి కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందని, యువజనోత్సవ పోటీల తదుపరి తేదీలను ప్రభుత్వం వారి ఆదేశముల మేరకు త్వరలో తెలియజేయడం జరుగుతుందని ఆయన అట్టి ప్రకటనలో తెలిపారు.

.