రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /
జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో పని చేస్తున్న కూలీలకు వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 200 రోజుల పనిదినాలు కల్పించాలని, రోజుకూలీ 600 రూపాయలు ఇవ్వాలని, ఈ సంవత్సరమన్నా ఉపాధిహామీ కూలీలకు నూతన పనిముట్లు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని రామలింగంపల్లిలో ఇంటింటికి వెళ్లి కూలీ సంఘం సభ్యత్వం చేయించిన సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బొడ్డు కిషన్, సిఐటియు మండల కన్వీనర్ మంచాల మధు, ఎస్ఎఫ్ఐ మండల నాయకులు గంగాదేవి సాయినాథ్ వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ నాయకులు వెంకటేష్ శారదమ్మ, బాలకృష్ణ, శివ కుమార్, అనిత, నరసమ్మ, సంధ్య, రేణుక తదితరులు పాల్గొన్నారు.