రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి : నూతన సంవత్సర వేడుకలు : కృషి ఐటిఐ, శ్రీ వాగ్దేవి జూనియర్ కళాశాల, శ్రీ సాయి కృప డిగ్రీ & పి జి కళాశాల, వాత్సల్య ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, వాత్సల్య ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వాత్సల్య పాలిటెక్నిక్ కళాశాల, వాత్సల్య ఫార్మసీ కళాశాల లలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి కృప వాత్సల్య కళాశాలల ఛైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్ సార్ మాట్లాడుతూ గత సంవత్సరంలో ఉన్న మంచిని స్వీకరించి చెడును మరచి పోవాలని ఈ నూతన సంవత్సరం అంతా మంచి జరగుతుందని అన్నారు. కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ సార్ మాట్లాడుతూ 2022 నూతన సంవత్సరంలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు మంచి జరగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కృషి ఐటిఐ ప్రిన్సిపల్ నామోజు రమేష్ , వాత్సల్య ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ ఎడమ శ్రీనివాస్ రెడ్డి, శ్రీ సాయి కృప డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అభిషేక్ మరియు శ్రీ వాగ్దేవి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రావణ్ రెడ్డి అకాడమీ కరస్పాండెంట్ యాకూబ్ బాబా అకాడమిక్ కోఆర్డినేటర్ ఆలేటి ఇస్తారి వైస్ ప్రిన్సిపాల్ మహేందర్, అధ్యాపకులు బిక్షపతి, వీరయ్య, శేఖర్, మోయిన్, శివ, ప్రసన్న, మాధవి, రాజు, నాగమల్లేష్, శ్యామ్, భార్గవి, పాండురంగo, వీరయ్య, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.