రాయల్ పోస్ట్ ప్రతినిధి
బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణంలోని వన్ టౌన్ ఎస్ ఐ కె విఠల్ కాంటా ఏరియా లో విధినిర్వహణలో ఉండగా చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల అక్కడున్న యచకులకు సరిగ్గా దుస్తులు కూడా లేని పరిస్థితిని చూసి చలించిపోయి. తాజ్ బాబా సేవాసమితి వ్యవస్థాపకులు ఉస్మాన్ పాషాకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పగానే వెంటనే స్పందించిన ఉస్మాన్ పాషా ఆ యచకులకు దుప్పట్లు తీసుకొచ్చి అందజేయడం జరిగింది. తదనంతరం ఎస్ ఐ విఠల్ మాట్లాడుతూ తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో మారుమూల గ్రామాలలో ,దట్టమైన అటవీ ప్రాంతాలలో ,చాలా మంచి సేవాకార్యక్రమాలు చేస్తున్న ఉస్మాన్ పాషా ని అభినందించారు, అదేవిధంగా తాను ఫోన్ చేసి చెప్పగానే స్పందించి యచకులకు దుప్పట్లు అందజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.