రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్తుల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణిని తప్పు పడుతూ వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భువనగిరి పార్లమెంట్ కో కన్వీనర్ మొహ్మద్ అతహర్ అన్నారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుండి కేసీఆర్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తు విద్యార్థులకు ఇవ్వ వలసిన స్కాలర్ షిప్,ఫీస్ రీ ఎంబెర్స్మెంట్ లను ఇవ్వకుండా వారి జీవితాలతో ఆడుకుంటుందని దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి గారి హాయంలో పేద విద్యార్థులు ఉన్నత చుదువులు చదువాలని మంచి లక్ష్యం తో ఫీజు రియంబేర్స్మెంట్ పథకం ప్రవేశ పెడితే ఈరోజు కేసీఆర్ దానిని పూర్తిగా తుంగలో తొక్కి గల్లీ కి ఒక బారు వాడకు ఒక వైన్స్ షాప్ ఓపెన్ చేసి బార్ల తెలంగాణ బీర్ల తెలంగాణ గా మార్చారు.గత 7 సవంత్సరాలలో కెసిఆర్ తన విలాసవంతమైన జీవితం కోసం ప్రగతి భవన్ నుండి ఫార్మ్ హౌస్ కు రాను పోను ఖర్చులు కొన్ని కోట్ల రూపాయలు ప్రజా సొమ్మును దుర్వినియోగం చేశారు అదే కొన్ని కోట్ల రూపాయలతో ఎంతో మంది పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇయ్యొచ్చు అనే సోయి కేసీఆర్ గారికి లేదా అని ఈ రోజు వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ తరుపు నుండి ప్రశ్నిస్తున్నాము.ఎన్నో కలలు కన్న తెలంగాణ ఈరోజు దొరల చేతిలో బందీ అయింది ప్రభుత్వం స్కాలర్ షిప్ లు ఇవ్వకుంటే బీద విద్యార్థుల చదువులు ఎలా కొనసాగాలి.చదువుకోవడం కేసీఆర్ గారికి ఇష్టం లేదా చుదువుకుంటే మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు అని భయమా.మత్తు మందుల మీద ఉన్న శ్రద్ధ చదువు మీద లేదా కేసీఆర్ సార్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్న కేసీఆర్ దొర తొందరలోనే గద్దె దిగడం కాయం.ఎన్నో ఇంజినీరింగ్, ఫార్మాసి, పీజీ కాలేజీ లను మూసి వేసి బీద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయడమే కాక ఉన్న కాలేజి లలో చుదువుతున్న వారికి స్కాలర్ షిప్ ఇవ్వకుండా వారిని ఇబ్బందికి గురిచేయడం కేసీఆర్ గారికి సబబు కాదు.ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ అభివృద్ధి చెందాలంటే నాణ్యమైన విద్య అవసరం అలాంటి విద్యను నిర్లక్ష్యం చేస్తూ రాష్ట్రాన్ని ఎం చేయాలని చూస్తున్నారో కేసీఆర్ సార్.ఇప్పటికైనా మేల్కొని పెండింగ్ ఉన్న 14 లక్షల పై చిలుకు విద్యార్థుల స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది.లేని పక్షంలో మా పార్టీ తరుపునుండి పెద్ద ఎత్తున ఉద్యమాల చేస్తాము అని హెచ్చరిస్తున్నాము.వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ పేద ప్రజల పార్టీ వారికి ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాటం చేస్తుంది.