రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: గురువారం రోజున పట్టణంలోని విజ్ఞాన్ వొకెషనల్ జూనియర్ కళాశాల విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలు స్థానిక రావి భద్రారెడ్డి గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్ గారు, విజ్ఞాన్ వొకెషనల్ జూనియర్ కళాశాల చైర్మన్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ గారు, కరస్పాండెంట్ కెతనబొయిన మల్లికార్జున్ సార్ సాధన స్కూల్ కరస్పాండెంట్ దనాపరెడ్డి గారు మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించినారు. సీనియర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ముఖ్య అతిధులు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ దరిపల్లినవీన్ కుమార్ గారు మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులో భువనగిరి పట్టణంలో అందిస్తున్న ఏకైక వొకెషనల్ విద్యాసంస్థ మన విజ్ఞాన్ వొకెషనల్ జూనియర్ కళాశాల అని విద్యార్థులు వినియోగించుకుని జీవితంలో ఉన్నత విద్యార్థులు వారి జీవితంలోవారు అనుకున్న లక్ష్యాలను సాధించాలని తెలిపారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని, కళాశాలలో అధ్యాపక బృందం ఎల్లవేళలా సంప్రదిస్తూ వారికి కావలసిన సబ్జెక్టులో అవగాహన పెంపొందించుకోవాలని విద్యార్థులు చదువుతోపాటు సామాజిక అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు సామాజిక మరియు సాంస్కృతిక రంగాల్లో అభ్యున్నతి సాధించాలని అని సూచించారు. కళాశాలలో అందిస్తున్న అన్ని రకాల సేవలని విద్యార్థులు వినియోగించుకోవాలని తెలిపారు. సాధన స్కూల్ కరస్పాండెంట్ దనాపరెడ్డి మాట్లాడుతూ సృజనాత్మకత ధోరణి లో చదువు ఉండాలని , ఉన్నత లక్ష్యాలను వారి జీవితంలోవారు అధ్యాపకుల సేవలని వినియోగించుకోవాలని కెతనబొయిన మల్లికార్జున్ సార్ మాట్లాడుతూ మీ బంగారు భవిష్యత్తుకు, కఠోర దీక్ష ఖచ్చితమైన ప్రణాళిక అవసరం అని తెలియజేయడం మాట్లాడుతూ సృజనాత్మకత ధోరణి లో చదువు ఉండాలని కోరడం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ బర్ల బిక్షం మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన ఉత్తమ విద్యను అందిస్తున్నామని తెలపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దరిపల్లి నవీన్ కుమార్ సాదన స్కూల్ కరస్పాండెంట్ దనాప రెడ్ది మరియు కళాశాల చైర్మన్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ సార్ కరస్పాండెంట్ కెతనబొయిన మల్లికార్జున్ సార్ పాల్గొన్నారు. మరియు అధ్యాపక బృందం యెమ్ లింగస్వామీ , నరెందెర్, జి.లింగ స్వామి ,హెమలత , చైతన్య, కావ్య, ఆదిత్య వర్ధన్ మరియు ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు,ప్రధమ సంవత్సరం విద్యార్థులు అధిక సంఖ్యలొ పాల్గొని ప్రెషర్స్ డే ప్రోగ్రామ్ విజయవంతంజేశారు.