ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాల షో రూమ్ ప్రారంభోత్సవం

షాద్ నగర్ రాయల్ పోస్ట్ ప్రతినిధి: ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరలు అందుబాటులో లేని స్థాయికి చేరుకున్న తరుణంలో, మరోవైపు కాలుష్యం లేకుండా ఎలక్ట్రికల్ వాహనాలు సమాజానికి ఊరట నిస్తాయని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ స్పష్టంచేశారు. షాద్ నగర్ పట్టణంలో ఈ వేగ ఆటోమోటివ్ ఎలక్ట్రిక్ బైక్ షోరూంను ప్రారంభించారు. సమాజ వ్యాప్తంగా వాయు కాలుష్యం కూడా లెక్కలకు మించి ఎక్కువగా పెరిగిపోతోందని ఇలాంటి సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగ పడతాయని అన్నారు. కాలుష్య నియంత్రణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఎలక్ట్రికల్ ద్వీచక్ర వాహనాల షోరూంను ప్రారంభించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ తో పాటు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వంకాయల నారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ‘విశ్వం, ‘జమృత్ ఖాన్, కట్ట వెంకటేష్ గౌడ్, చింటు,సర్వర్ పాషా, గంధం శేఖర్, చెట్ల నరసింహా, జూపల్లి శంకర్, పిల్లి శేఖర్, రఘమా రెడ్డి, చిన్న, జాంగారి రవి, ముత్యాలు స్థానిక ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..