భారత విద్యార్థి ఉద్యమ పోరాటంలో ఎస్.ఎఫ్.ఐ ది ప్రత్యేక పాత్ర అని ఎస్ఎఫ్ఐ జిల్లా అద్యక్షుడు వనం రాజు అన్నారు. 51వ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా జిల్లా కేంద్రంలోని SFI పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల ఆవరణ లో స్వాతంత్ర్యం,ప్రజాస్వామ్యం,సోషలిజం లక్ష్యాలు గల పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థి అమరవీరులకు జోహార్లు అర్పించి అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు శాస్ర్తీయ విద్యావిధానం కోసం,నాణ్యమైన చదువులకోసం ఉపాది హక్కుల కోసం నికరంగా ఉద్యమిస్తున్న సంఘం ఎస్ఎఫ్ఐ.కేరళా రాష్ర్టంలో 1970 లో ఆవిర్బవించి అద్యయనం-పోరాటం నినాదంతో విద్యార్థుల చైతన్యం చేసి విద్యార్థి వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాల నడుపుతుంది. పేద,మద్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలని, విద్యా కార్పోరేటీకరణ,కాశాయీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ దేశ వ్యాప్తంగా 50 లక్షల సభ్యంత్వంతో అతి పెద్ద విద్యార్థి సంఘంగా ముందుకు పోతుందన్నారు. విద్యా ఉపాది హక్కులకోసం విద్యార్థిలు ఎస్.ఎఫ్.ఐ చేసే పోరాటాల్లో బాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు అవలంభించే విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ఈర్ల రాహుల్,SFI నాయకులు బుగ్గ ఉదయ్, శివ, కళాశాల అద్యక్ష కార్యదర్శి ప్రసన్న కుమారి, నందిని కళాశాల కమిటీ సభ్యులు తనుష,భవాని,అనిత,శ్రీలేఖ,అన్హుప, మౌనిక తదితరులు పాలుగొన్నారు.