రాయల్ పోస్ట్ ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం మధురాపురం గ్రామంలో నూతన ప్రాథమిక వైద్య ఆరోగ్య ఉప కేంద్రాన్ని బుధవారం స్థానిక ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా ప్రారంభించారు. దీనితో సుమారు 1800 జనాభాకు సంబంధించి వైద్య అవసరాలు తీరతాయని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కృషితో గ్రామాల్లో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. ప్రజలకు నిత్యం వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రధానంగా డాక్టర్ సేవలు నెలలో నాలుగు రోజుల పాటు పర్యవేక్షణ ద్వారా గ్రామస్తులకు వైద్యం అందిస్తే బాగుంటుందని ఎంపిటిసి భార్గవ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సర్పంచ్ శివారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, యువకులు వైద్య కేంద్రం ఏర్పాటుకు సహకరించినట్టు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మధుసూదన్ రావు, మల్కయ్య గారి గోవర్ధన్ రెడ్డి, ఎల్. రాజశేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ కృష్ణయ్య, శ్రీనివాస్ గౌడ్, సందీప్ గౌడ్, అమర్నాథ్ రెడ్డి, వినాయక గౌడ్, గుండ్రాతి నర్సింలు గౌడ్, సురేష్ గౌడ్, పర్వత రెడ్డి, పి .శివా రెడ్డి, కిషోర్ గుప్తా, కమ్మరి శివ కుమార్, సాకలి శ్రీను, శ్రీనివాస్ చారి, రవి కుమార్ గుప్తా, బొమ్మూ నర్సింహులు, నక్కల శ్రీశైలం గౌడ్, వైద్య సిబ్బంది శ్రీలత, అంగన్వాడి టీచర్స్ విద్యావతి, సరస్వతి తదితర ఏఎన్ఎంలు ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..