రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /యాదాద్రి భువనగిరి జిల్లా భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చి 75 సం||లు నిండిన సందర్భంగా భారత ప్రభుత్వం స్వాతంత్ర స్వర్ణోత్సవoలో భాగంగా అమృతోత్సవాలు ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించబడుచున్నవి. అందులో భాగంగా 75 వ స్వాతంత్ర్య వార్షికోత్సవo సందర్బంగా భారతదేశనికి 75 కోట్ల సూర్య నమస్కారములు సమర్పణ సంబందించి ప్రచార పత్రంను కే.ధనంజనేయులు, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి ,యాదాద్రి భువనగిరి జిల్లా యోగ అసోసియేషన్,జిల్లా కోర్దినేటర్ల సమక్షాoలో యోగ లోగోను ఆవిష్కరించారు.కే. ధనంజనేయులు, జిల్లా యువజన, క్రీడల అధికారి ధనంజనేయులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఒక్కొకరు రోజుకి 13 సూర్య నమస్కారములు చొప్పున 21 రోజులు చేయడం వలన భారత ప్రభుత్వం చే విలువైన సర్టిఫికెట్ పొందుతారని అదేవిదంగా భారత దేశ స్వాతంత్రానికి 75 సంవత్సరంలు పూర్తయిన శుభసందర్బంగా మన మాతృభూమికి, భారతదేశానికి బహుమతిగా అందరికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించడానికి భారతీయులను ప్రోతహించడానికి 75 కోట్ల సూర్య నమస్కారములు యాదాద్రి జిల్లా వ్యాప్తంగా కలసి చేయడానికి రావాలని అన్నారు. అలాగే ప్రతి రోజు 30 నిమిషములు తప్పని సరిగా యోగా వ్యాయామము చేయాలనీ జీవనశైలిలో ఒక బాగం చేసుకోవాలని జిల్లా ప్రజలను కోరారు. దీనికి సంబందిచిన రిజిస్ట్రేషన్ http://www.75suryanamaskar.com లో రిజిస్టర్ కావాలని అన్నారు.
కార్యక్రమంలో యోగ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా కోర్దినేటర్ల అంబోజు అనిల్ కుమార్, బొడ్డుపల్లి సైదులు, ఝాన్సీ రాణి, నవ భరత్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు కరుణ్, సిద్దిరాములు మరియు సిబ్బంది సిలివేరు సైదులు, మురళి పాల్గొన్నారు.