రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 137 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు,తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎలుగల రాజయ్యను తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో తుర్కపల్లి మండల కాంగ్రెస్ నాయకులు గడ్డమీది యాదగిరి, తలారి అశోక్, కోట సురేశ్, భూక్యా రమేశ్ నాయక్ లు మంగళవారం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ 137 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ భారత దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీగా నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఐన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుందని కొనియాడారు