రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /చౌటుప్పల పట్టణం మున్సిపల్ పరిధిలోనితంగడిపల్లి రోడ్డులో ఉన్న నాగుల కుంట చెరువు అభివృద్ధి సుందరీకరణ పనులకి శంఖుస్థాపన చేశారు. మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు మాట్లాడుతూ.దివీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ వారి ఆర్థిక సహాయంతో నాగుల కుంట అభివృద్ధి మరియుసుందరీకరణకు గాను కోటి 30 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల పై అంతస్తు నిర్మాణం కోసం కోటి 30 లక్షల రూపాయలను వెచ్చించి చౌటుప్పల పట్టణాన్ని అభివృద్ధి పరచడంలో దివిస్ తనవంతు సహాయంగా సహకరించినటువంటి యాజమాన్యానికి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ వెన్ రెడ్డి రాజు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ. కె నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, మున్సిపల్ పాలకవర్గం సభ్యులు మరియు దివిస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్, ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పాల్గొన్నారు