రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ / స్థానిక రావి భద్రారెడ్డి రెడ్డి ఫంక్షన్ హాలులో క్రిస్మస్ ఫెస్ట్ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, క్రీస్తు చూపిన ప్రేమ, కరుణ, శాంతి మార్గంలో మనమంతా పయనించాలని, సమాజంలో తోటి వారికి సహాయపడాలని అన్నారు.
కార్యక్రమంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రార్థనలు చేశారు.
కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సత్యనారాయణ, భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ కృష్ణయ్య, జెడ్ పి టి సి బీర్ల మల్లయ్య, ఎంపీపీ నరాల నిర్మల, ఎం పి టి సి. కృష్ణ, క్రిస్మస్ సెలబ్రేషన్ ఆర్గనైజేషన్ కమిటీ ప్రెసిడెంట్ సుదర్శన్, సభ్యులు ప్రకాష్, ఆనందరావు, ప్రేమ్ కుమార్, కృష్ణయ్య, రెవరెండ్ మాణిక్యరావు, ఫాదర్ లు పాల్గొన్నారు.