రాయల్ పోస్ట్ ములుగు ; కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భముగా ములుగు జిల్లా కేంద్రము లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రము లో ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు, ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క గారి పిలుపు మేరకు 137వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయగా అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు విచ్చేసి జెండాని ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 137వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే ఈ రోజు సరిపోదు అని, ముఖ్యంగా 1884 లో ఒక బ్రిటిషర్ అయిన అలన్ ఆక్టావియాన్ హ్యూమ్ అనే వ్యక్తి దేశ ప్రయోజనాల కోసం ఇండియన్ నేషనల్ యూనియనుగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ 137 యేండ్ల నుండి భారత దేశం మీద ఇంత ప్రభావం చూపుతుంది అని ఎవరు అనుకోలేదు. భారత దేశ ప్రజలందరిని ఒక తాటి మీదకి తెచ్చి స్వాతంత్య్రం తెచ్చుకోవాలనే కాంక్షతో ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ పార్టీ 1885 డిసెంబర్ 28 న దాదాబాయి నౌరోజీ చేతులమీదుగా ఇండియన్ నేషనల్ కాంగ్రెసుగా పేరు మార్చడం జరిగింది. అసలు ఏక ఛత్రాధిపత్యం వహించిన ఏకైక పార్టీ, స్వాతంత్య్రం రాక ముందు బ్రిటీషుల దగ్గరి నుండి స్వాతంత్య్రం తీసుకు రావడానికి సరైన వేదిక లేక దిక్కు తోచని స్థితిలో, ఆ సేతు హిమాచలాన్ని సైతం ఒక తాటి మీదకి తెచ్చి, భారతీయుడి నర, నరాన ఉద్యమ స్ఫూర్తి తీసుకు వచ్చిన పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. వందల సంవత్సరాల బానిస సంకెళ్లను తెంపి, ఓ మహోజ్వల ఘట్టానికి తెరలేపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, ఆరు దశకాల పాటు పోరాటం సాగించి భారత మాత నుదిటి మీద స్వాతంత్య్ర తిలకం దిద్దిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, స్వాతంత్రం సిద్దించాక ఏడు దశాబ్దాలు నవ భారతానికి అడుగులు వేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అలా ఆవిర్భావం నుండి భారత దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశానికి వెన్నుముక అయిన రైతన్నను వ్యవసాయ చట్టాల పేరుతో మోసం చేస్తున్నాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యసంగికి వరి వేయొద్దని, చిరు ధాన్యాల పంటలు మాత్రమే పెట్టాలని, ప్రభుత్వం చిరు ధాన్యాలు పెడితేనే రైతుబంధు ఇస్తానని రైతులకు ఆంక్షలు విధించి, ఇప్పుడేమో అసలు ధాన్యం కొనుగోలు చేయమని చేతులెత్తేయడం కరెక్టు కాదని అన్నారు. ఇప్పటికి అయిన రైతులు అందరూ ఏకం కావాలి అని రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని రైతులకు అన్యాయం చేసే పార్టీలపై పోరాటం చేయడానికి తాను ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది అని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్ టీపీసీసీ కార్యదర్శి పై డాకుల అశోక్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,
ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,మైనార్టీ సెల్ జిల్లా ఎండీ అయుభ్ ఖాన్,మహిళ అధ్యక్షురాలు కొమురం ధన లక్ష్మి
మచ్చ శాఖ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి
మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, చెన్నోజు సూర్యనారాయణ
మైల జయరాం రెడ్డి,ఎండీ ఆప్సర్ పాషా, వజ్జ సారయ్య,జెడ్పీటీసీ నామ కరం చంద్ గాంధీ,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్
సుంకర బోయిన మొగిలి,సహకార సంఘం చైర్మన్ లు పాన్నాల ఎల్లారెడ్డి,బొక్క సత్తి రెడ్డి
పులి సంపత్ గౌడ్,వైస్ చైర్మన్ మర్రి రాజు,సర్పంచులు పసుల సాంబయ్య,రేగ కల్యాణి,గండి కల్పన కుమార్,ఎండీ అహ్మద్ పాషా
ఎంపీటీసీ మావురపూ తిరుపతి రెడ్డి
చింత చంద్రయ్య,సభ్యత్వ నమోదు ఇంచార్జీ లు, జిల్లా మండల అధ్యక్షులు అనుబంధ సంఘాల జిల్లా మండల అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు బూత్ స్థాయి ఇంఛార్జి లు,ఉప సర్పంచ్ లు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు