• రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: రైతు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని కార్మిక చట్టాలను కాపాడుకోవడం కోసం ఉద్యమానికి సిద్ధం కావాలి*
  • దాసరి *
  • సిఐటియు జిల్లా కార్యదర్శి *
  • కార్మికులు రైతులు ఉద్యxమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక ఎండగడుతూ కార్మిక చట్టాలను కాపాడడం కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి దాసరి పాండు అన్నారు*
    ఈ రోజున సిఐటియు జిల్లా కమిటీ సమావేశం స్థానిక సుందరయ్య భవన్లో కోమటిరెడ్డి చంద్ర రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను మారుస్తూ కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు బానిసలుగా తయారు చేస్తుందని దీంతో పాటు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటినీ ప్రైవేటు పరం చేస్తూ నిరుద్యోగ సమస్యను పెంచుతుందని కార్మిక చట్టాలు లేకుండా చూస్తున్నదని విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 23 24 తేదీల్లో జరిగే సమ్మెను జయప్రదం చేయాలని వారన్న ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కూరెళ్ల రాములు జిల్లా కౌన్సిల్ సభ్యులు మాయ కృష్ణ దేవేందర్ రెడ్డి గణపతి రెడ్డి నాయకులు మధు, రాంచందర్, జహంగీర్, తదితరులు పాల్గొన్నారు