రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: ఆలేరు పట్టణ ప్రాంతంలోని స్థానిక రామసముద్రం బైపాస్ రోడ్ లో గల జిందా షా మదార్ సాహెబ్ దర్గా ఉర్సు ఉత్సవాలకు ముస్తాబైంది. ప్రతి సంవత్సరం ఉర్దూ నెల క్యాలెండర్ ప్రకారం మదార్ నెల ఆఖరి శుక్రవారం గంధం ఊరేగింపు జరుగును.గత 15 సంవత్సరములుగా ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించండం జరుగుతుంది. అందులోనే భాగంగా ఈ నెల 31-12-2021 శుక్రవారం రోజున మధ్యాహ్నం 1.30 గంటల నుండి దర్గా సంరక్షకులు అయిన బీజని.మధుకుమార్ గారి ఇంటి దగ్గర నుండి రామసముద్రం బైపాస్ రోడ్ లో గల జిందా షా మదార్ దర్గా వద్దకు గంధం ఊరేగింపు జరుగును అని జిందా షా మదార్ సాహెబ్ ఉర్సు ఉత్సవ కమిటీ తెలిపారు.భక్తులకు మధ్యాన్నం 1.00 గంటల నుండి అన్నదాన సౌకర్యం కలదు. భక్తులు కోవిడ్ నిబంధనలను పాటించి అధిక సంఖ్యలో పాల్గొని బాబా గారి ఆశీర్వాదం పొందగలరు.