ప్రభుత్వ ద్వంద విధానంతో దగ పడుతున్న ప్రభుత్వ దవాఖాన కార్మికులు….

రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /ఆసుపత్రి కార్మికులకు కనీస వేతనాల పెంపు జీవో 21 అమలు చేయాలి.
పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేయాలి.ఎండీ యూసుఫ్ తెలంగాణ రాష్ట్ర మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు. ప్రభుత్వ ద్వంద విధానాలతో ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న కార్మికులు వెట్టిచాకిరికి గురవుతున్నారని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు యం.డి.యూసుఫ్ ఆరోపించారు.. శుక్రవారం జిల్లా కేంద్రంలోని భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం జిల్లా స్థాయి సమావేశం జరిగింది.ఈ సమావేశానికి యం. డి. యూసఫ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్స్,పేషంట్ కేర్, సూపర్వైజర్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది అని మండిపడ్డారు. 2012 సంవత్సరంలో అనేక పోరాటాల తర్వాత జీవో నెంబర్ 68 రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని నేటికీ అదే పాత జీవోనే అమలు చేయడం వల్ల కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల జీతాలు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేసిన ఫలితంగా జూన్ 25న కార్మికుల జీతాలను 19 వేలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 21 ని విడుదల చేసిందని అన్నారు. కానీ జీవో నెంబర్ 21 నేటికి అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వంద విధానాన్ని అనుసరిస్తూ యాజమాన్యాలతో దొడ్డిదారిన దరఖాస్తులు పట్టిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే భేషరతుగా జీవో నెంబర్ 21న విడుదల చేయాలని అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు పాలకులు కనీస వేతనాలు చెల్లించకుండా కార్మికుల పొట్ట కొడుతున్నారు అని ధ్వజమెత్తారు. కార్మికులకు చెల్లించే వేతనాల టెండర్లే లోపభూయిష్టంగా ఉన్నాయని ప్రభుత్వ అసమర్థత విధానాలతో కార్మికులు అర్థాకలితో అలమటించే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం కనీస వేతనాలు జీవో 21 అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి ఇమ్రాన్, గుండు వాణి, కొల్తూరి భాగ్యమ్మ, రాచకొండ పుష్ప, మేడబోయిన లక్ష్మి, జెర్రీపోతుల కమలమ్మ, కృష్ణ, నర్సింహా, సోమనర్సయ్య, గాయపాక సులోచన, భారతమ్మ, హేమలత, లలిత, స్వప్న, శారదా, నాగరాణి,పావని, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.