రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: . శుక్రవారం రోజున పట్టణంలోని శ్రీ సాయి కృప వారి శ్రీ విజేత డిగ్రీ & పిజి కళాశాల విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలు స్థానిక రావి భద్రారెడ్డి గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కి ముఖ్య అతిథులుగా వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్
శ్రీ సాయి కృప గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ , దరిపల్లి అనంత రాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఖమ్మం కళాశాలల చైర్మన్ దరిపల్లి కిరణ్ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించినారు. సీనియర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ దరిపల్లినవీన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు శ్రీ సాయి కృప ఇన్స్టిట్యూషన్ కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులో భువనగిరి పట్టణంలో అందిస్తున్న ఏకైక విద్యాసంస్థ
శ్రీ సాయి కృప విద్యా సంస్థలను విద్యార్థులు వినియోగించుకుని జీవితంలో వారు అనుకున్న లక్ష్యాలను సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లో దరిపల్లి అనంత రాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఖమ్మం కళాశాలల చైర్మన్ దరిపల్లి కిరణ్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు కళాశాల ప్రిన్సిపల్ అభిషేక్ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని, కళాశాలలో అధ్యాపక బృందం ఎల్లవేళలా సంప్రదిస్తూ వారికి కావలసిన సబ్జెక్టులో అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు కళాశాల అకాడమిక్ కరస్పాండెంట్ ఎండి యాకుబ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు సామాజిక అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ రాము మాట్లాడుతూ విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి కళాశాల యాజమాన్యాన్ని, అధ్యాపక బృందం ను, వినియోగించుకోవాలని సూచించారు. కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ ఆలేటి ఇస్తారి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సామాజిక మరియు సాంస్కృతిక రంగాల్లో అభ్యున్నతి సాధించాలని అని సూచించారు కళాశాలలో అందిస్తున్న అన్ని రకాల సేవలని విద్యార్థులు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో శ్రీ వాగ్దేవి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రావణ్ రెడ్డి, కృషి ఐటిఐ ప్రిన్సిపల్ నమోజు రమేష్ జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ మహేందర్ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు