షాదనగర్ ముఖ్య కూడలిలో కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం

రాయల్ పోస్ట్ ప్రతినిధి: యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అందరికీ పాస్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా చేస్తున్న నిరసనకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల నిరసిస్తూ షాదనగర్ నియోజకవర్గం చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ షాదనగర్ అధ్యక్షుడు కాట సుధీర్ మాట్లాడుతు గత సంవత్సరం కరోన మహమ్మారి వల్ల చాల మంది విద్యార్థులు ఆన్లైన్ లో పాఠాలు వినడానికి ఇబ్బంది పడ్డారు.రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో విద్యార్థులకు హుటాహుటిన పరీక్షలు నిర్వహించి ప్రభుత్వం వారి పై ఒత్తిడి తెచ్చింది. చాలా మంది విద్యార్థులు ఒత్తిడికి గురై ఫెయిల్ కావడంతో వారు ఆత్మహత్య చేసుకున్నారు వారి ఆత్మహత్య లకు ప్రభుత్వం బాధ్యత వహించాలని తక్షణమే ఫెయిల్ అయిన విద్యార్థులను అందరిని పాస్ చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థులకు న్యాయం జరిగే వరకు యువజన కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ఉపాధ్యక్షుడు భాస్కర్, ఎన్ఎస్ యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, కార్యదర్శులు నరేందర్, ఉదయ్, జిజోజాన్సన్,సాయి గౌడ్, అవుల శ్రీకాంత్, మహేశ్ గౌడ్,శ్రీకాంత్, ప్రశాంత్, ఇంద్ర రెడ్డి,శివ,ఇంతియాజ్,సామి,ఇంద్ర గౌడ్, పవన్, జహంగేర్, అరిఫ్,సందీప్,లతీఫ్,మనీష్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..