రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: జాతీయ రైతుదినోత్సవ శుభాకాంక్షలు
రైతు దినోత్సవం సందర్బంగా ఈ రోజు సాయంత్రం 5:00 గం లకు ఉత్తమ రైతులకు సన్మాన కార్యక్రమం రోటరీ అధ్యక్షులు చెన్న లక్ష్మణ్ గారి అధ్యక్షతన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆవరణలో నిర్వహించడం జరిగింది
ఈ సందర్బంగా మాట్లాడుతూ నేడు రైతు లేకపోతె మానవ మనుగడ ప్రశ్నర్ధకం అన్నారు
రైతే రాజు, రైతే మంత్రి, రైతే సేనాని, రైతే సేవకుడు అని అన్నారు ఈ కార్యక్రమంలోసన్మాన గ్రహీతలు
యం ధర్మయ్య, నాయిని వెంకటేశ్వర్లు,వక్కల సత్యనారాయణ, ఊదరి గణేష్, ముగ్గు రాములు, కరిపే నర్సింగ్ రావు , ఘనంగా సన్మానించడం జరిగింది.
కోశాధికారి రో.భోగ హరికృష్ణ, ఎన్నిక అధ్యక్షలు రో.బండారు శ్రీనివాసరావు, ఎన్నిక కార్యదర్శి రో. కరిపే నర్సింగ్ రావు,డాక్టర్ రఘు వేంకట సురేష్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు