రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: హజరత్ ఉజాలే షా R. A. గంధం ఊరేగింపు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా దర్గా
ముతవల్లి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా ఉర్సు ఉత్సవలను కులమతాలకు అతీతంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే భక్తులు తమ మొక్కులను తీర్చుకోడానికి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేస్తారని అన్నారు.మరియు భువనగిరి పట్టణ ప్రజలపై హజరత్ ఉజాలే షా ఆశీస్సులు ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమం లో ముతవల్లులు, మత పెద్దలు, మరియు షేక్ మీరా. అలీం ఉద్దీన్, షాహాబ్ ఉద్దీన్, సిరాజ్ ఉద్దీన్, హుషాముద్దీన్, జహంగీర్ చౌదరి, జియా ఉద్దీన్, ఆలా ఉద్దీన్, సుజాయత్, ఇర్షాద్ , తదితరులు పాల్గొన్నారు.