రాయల్ పోస్ట్ ప్రతినిధి

రాయల్ పోస్ట్ ప్రతినిధి బెల్లంపల్లి: ఈ రోజు సింగరేణి లో జరిగిన ప్రమాదం ముమ్మాటికీ యాజమాన్యమే కారణం , ప్రమాదం లో ఆపరేటర్ శ్రీనివాస్ చనిపోవడం బాధాకరం. గడిచిన 3 నెలల వ్యవధిలో చాలా మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. అంటే మన యాజమాన్యానికి ఉత్పత్తి మీద ఉన్న శ్రద్ధ కార్మికులు రక్షణ మీద లేదు అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది . జరిగిన ప్రమాదానికి కారకులైన వాళ్ళ పైన తగిన చర్యలు తీసుకొని కార్మిక కుటుంభానికి వెంటనే ఒక కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలి . ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం నుండి డిమాండ్ చేస్తున్నాం.