రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /భువనగిరి మండలం పెంచికల పహాడ్ గురువారం బేతస్థ చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చ్ ఫౌండర్ వల్లూరి.జాన్ ప్రసాద్ మాట్లాడుతూ దావీదు పట్టణమందు క్రీస్తు జన్మించెను ఆయనే యేసుక్రీస్తు ప్రభువు అని తెలిపినారు.అనంతరం చర్చ్ లో కేక్ కట్ చేసి క్యాండిల్ వెలిగించి పిల్లలకు పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాస్టర్.ప్రవీణ్ కుమార్, గ్రామ సర్పంచ్. పుష్ప ఎల్లయ్య,ఎస్ ఎస్ ఫౌండేషన్ చైర్మన్ సాయి విక్టర్ గ్రామస్తులు పాల్గొన్నారు.