రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: వేల్పుపల్లిలో ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను పరిశీలించి కొలతలు చేసిన రెవెన్యూ సిబ్బంది….

కబ్జాలు నిజమేనని తేల్చిన అధికారులు…….

రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు వెల్లడి…..

కాంగ్రెస్ పార్టీ పోరాటపలితంగానే ప్రభుత్వ భూములను కాపాడమన్న

తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్…..

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వేల్పుపల్లి గ్రామంలో గల 152 సర్వేంబర్ లోని కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కబ్జాచేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నోటీసులు జారీ చేయించడంతో పాటు కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడడం కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాట పలితమేనని తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ అన్నారు తుర్కపల్లి మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేల్పుపల్లిలో గ్రామంలో రియల్ ఎస్టేట్ మాఫియా ప్రభుత్వ భూములను కబ్జాచేస్తున్న విషయం తెలుసుకుని మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి వెళ్లి అట్టి ప్రభుత్వ భూములను పరిశీలించి స్థానిక తహశీల్దార్ జ్యోతికి పిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారుల బృందం కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూములను పరిశీలించి కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలు నిజమేనని తేల్చి కబ్జాలకు పాల్పడుతున్న సంబంధిత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు కబ్జాకోరుల నుండి ప్రభుత్వ భూములను కాపాడినట్లు చెప్పారన్నారు అక్రమంగా ప్రభుత్వ భూములను చదును చేయడంతో పాటు ఆక్రమణలను తొలగించాలని ఆదేశించినట్లు తెలిపారని పేర్కొన్నారు బాద్యులైన రియల్ మాఫియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంకా పేద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవిలికపల్లి శ్రీనివాస్,సేవాదల్ మండల అధ్యక్షుడు తలారి అశోక్,మండల కాంగ్రెస్ నాయకులు,కోట సురేష్,పసుల సత్యనారాయణ, భూక్యా రమేశ్ నాయక్,బండారి శ్రీనివాస్,పిడుగు రమేష్,కోట జహింగిర్,పసుల కనకరాజు తదితరులు ఉన్నారు