రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్
తేది: 23.12.2021 నాడు మద్యానం 10.30 గంటలకు అంతరాష్ట్ర దొంగ జేబు దొంగ అయిన నిందితులు ఎట్టా అంజనేయులు ను భువనగిరి పట్టణంలో గల ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగినది. గతం లో నిందితుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని పలు పోలీస్ స్టేషన్ లలో దొంగతనం కేసులలో జైలుకు వెళ్ళి విడుదలయి మళ్ళీ దొంగతనాలు చేస్తున్నాడు.
ఎట్టా అంజనేయులు @ మట్టా ఆంజనేయులు @ అజయ్ @ పందిరి ఆంజనేయులు @ అంజి @ అనిల్ s /o కోటయ్య , వయస్సు: 40 సం., కులం; ST ఎరుకల , వృత్తి: డ్రైవరు , నివాసం: సిద్దికు నగర్ , గచ్చిబౌలి , హైదరాబాద్ , n /o h . No 26-78, భీమరాజుగట్ట , ఈబ్రహీంపట్నం , విజయవాడ , కృష్ణ జిల్లా.
నేరస్థుడు భువనగిరి బై-పాస్ రోడ్డు సింగన్నగూడెం వద్ద పిర్యాది యం. డి జాకీర్ హుస్సైన్ రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ ను ఫోటో గ్రాఫ్ చేస్తుండగా తన జేబు నుండి 38,000 /- రూపాయలు మరియు ఇతర వ్యక్తుల నుండి 8,400/- రూపాయలు దొంగిలించి నారని అని పిర్యాదు మేరకు వెంటనే భువనగిరి పట్టణ పోలీస్ నందు Cr.No. 286/2021 U/s 379 IPC లో కేసు రిజిస్టర్ చేసి నిందుతుడిని అదుపులో తీసుకొని నిందితుడిని నుండి 45,000/- రూపాయల దొంగసోత్తు ను స్వాదీనం చేసుకొని రిమాండ్ కి తరలించినారు .
పై అరెస్ట్ లు శ్రీ యస్. వెంకట రెడ్డి , ACP భువనగిరి డివిజన్ గారి పర్యవేక్షణ లో శ్రీ A. సుధాకర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మరియు DSI B.వెంకటయ్యమరియు Crime సిబ్బంది PC 1834, E.Mahesh,pc 4272 సురేష్ , భువనగిరి టౌన్ పైన తెలిపిన నిండుతుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినారు.