రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి :శ్రీ వాగ్దేవి మరియు శ్రీ సాయి కృప డిగ్రీ కళాశాల ఆవరణలో గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినవి ఈ కార్యక్రమంలో శ్రీ సాయి కృప విద్యా సంస్థల కరస్పాండెంట్ ప్రవీణ్ మాట్లాడుతూ నిజజీవితంలో గణిత శాస్త్ర ప్రాధాన్యతను శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రము నకు చేసిన సేవలు వివరించారు. ఈ సందర్భంలో గణిత శాస్త్రం అధ్యాపకులు గుర్రపు భిక్షపతి సన్మానించారు . డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నిజ జీవితంలో గణిత పరిజ్ఞానం చాలా అవసరమని మరియు సమస్య పరిష్కార విధానము నిజ జీవిత సమస్యల పరిష్కారం మనకు ఉపయోగపడుతుందని తెలియజేశారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కొలను శ్రావణ్ రెడ్డి మాట్లాడుతూ గణిత శాస్త్రంతో ఇతర శాస్త్రాలకు గల సంబంధం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి రాము అకాడమీ కరస్పాండెంట్ యాకూబ్, జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గుండెబోయిన మహేందర్, ఆర్ కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ ఆలేటి ఇస్తారి మరియు ఐటిఐ ప్రిన్సిపల్ రమేష్ అధ్యాపకులు శేఖర్, నరేందర్, వీరయ్య, మోహన్ క్రాంతి కుమార్ , ప్రసన్న మాధవి మరియు ఐటిఐ స్టాఫ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.