రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: ప్రేరణ కలిగించే శిక్షణ తరగతులు
ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మౌంటాబ్, రాజస్థాన్ నుండి రాజయోగి BK దిల్ రెడ్డి గారు భువనగిరి శాఖకు సంబంధించిన శిక్షణ తరగతులను భువనగిరిలోని వాత్సల్య పాలిటెక్నిక్ కళాశాల, దేదిప్య హైస్కూల్ , కృషి ఐటిఐ, శ్రీ వాగ్దేవి జూనియర్ కళాశాల, విజేత వారి శ్రీ సాయికృప డిగ్రీ & పిజి కళాశాల, వాత్సల్య ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తో పాటు పలు విద్యా సంస్థలలో మెడిటేషన్, సహజయోగ, శిక్షణ తరగతులు నిర్వహించారు. సంతోషకరమైన ముఖము ద్యారనే మన లైఫ్ స్టయిల్ మారుతుందని, బ్రహ్మ ముహూర్తంలో లేచిన వారికే జ్ఞాపకశక్తి అనేది పెరుగుతుంది. దీనివల్ల చాలా లాభాల్ని పొందగలుగుతారు అని ప్రముఖ రాజయోగి దిల్ రెడ్డి గారు తెలియజేశారు. సంతోషానికి మించిన పౌష్టికాహారం మరొకటి లేదని BK చంద్రకళ అక్కయ్య గారు తెలియజేశారు. ఈ కార్య్రమానికి BK చంద్రకళ, BK బాలేశ్వర్, BK రామేశ్వర్, BK అరవింద్, BK ప్రేమలత వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఛైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్, దేదీప్య స్కూల్ కరస్పాండెంట్ రంగ రావు , ప్రిన్సిపల్ శేషగిరి, కృషి ఐటిఐ కరస్పాండెంట్ BK దరిపల్లి ప్రవీణ్ కుమార్, శ్రీ వాగ్దేవి జూనియర్ ప్రిన్సిపల్ శ్రావణ్ రెడ్డి, శ్రీ సాయి కృప డిగ్రీ, పిజి కళాశాల ప్రిన్సిపాల్ అభిషేక్, అకాడమిక్ కరస్పాండెట్ యాకూబ్ అధ్యాపకులు భిక్షపతి, రాము, మహేందర్, వీరస్వామి, శేఖర్, మాధవి, నరేందర్ రెడ్డి, మోయిన్, శివ, ఇస్తారి, కృషి ఐటిఐ ప్రిన్సిపల్ రమేష్ అధ్యాపకులు పాండురంగం, రాజు, శ్యామ్, నాగమల్లేష్ వాత్సల్య ఎలిమెంటరీ ఏడుకేషన్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి మరియు అన్ని కళాశాలల విద్యార్థినీ, విద్యార్దులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.