రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి:శ్రీ వైష్ణవి కళాశాల లో నేడు గణితశాస్త్రం దినోత్సవ సందర్భంగా శ్రీ రామానుజన్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కళాశాలలో ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించడం జరిగినది బైపీసీ విభాగంలో కర్షియ కౌకబ్ 440 మార్కులకుగాను 437 మార్కులు సాధించి భువనగిరి జిల్లా చరిత్రలో మొదటిసారిగా ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించినది. అదేవిధంగా టీ మల్లిక 430 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఏడవ ర్యాంకు సాధించినది. సి ఇ సి విభాగంలో 481 మార్కులకతో ఆఫ్రికన్ జిల్లా మొదటి ర్యాంకు సాధించినది. ఎంపీసీ నందు సాహిత్ రెడ్డి 446 మార్కులతో m e c విభాగం నందు 429 మార్కులతో ఉత్తమ బ్ర ప్రతిభ కనబరిచారు ఇంకా 68 మంది విద్యార్థులకు పైగా (400)నాలుగు వందల మార్కులు సాధించడం జరిగింది మరియు యాదాద్రి జిల్లాలో అత్యధిక ఉత్తీర్ణతా శాతాన్ని సాధించిన కళాశాల గా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాలల కరస్పాండెంట్ శ్రీ పడాల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ మధుర మల్లేశం, అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు