వేల్పుపల్లిలో ప్రభుత్వ భూములను పరిరక్షించాలి…..

తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ డిమాండ్……

రాయల్ పోస్ట్ ప్రతినిధి తుర్కపల్లి డిసెంబర్ / యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వేల్పుపల్లి గ్రామంలోని ప్రభుత్వ భూములను పరిరక్షించాలని తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు ప్రభుత్వ భూముల ను కాపాడాలనే డిమాండ్ తో మండల కాంగ్రెస్ నాయకులు తలారి అశోక్, కోట సురేశ్, భూక్యా రమేశ్ నాయక్ లతో కలిసి స్థానిక తహశీల్దార్ జ్యోతికి మంగళవారం వినతిపత్రం అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల్పుపల్లి గ్రామ శివారులో గల ప్రభుత్వ సర్వేనెంబర్స్ 152 లోని సుతుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ డిమాండ్……మారు 35 ఎకరాల సర్కారు భూములను రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి పలుకుబడి కలిగిన నాయకులు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములపై కన్నేసి చదును చేసి కబ్జాకు పాల్పడుతున్న సంబంధిత అధికారులు ఆమ్యా మ్యాలకు అలవాటు పడి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు సంబంధిత సర్కారీ బూములను కాపాడటంతో పాటు కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తులపై విచారణ జరిపించి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయంతో పాటు కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు