రాయల్ పోస్ట్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమిషనరేట్

యువత తమ విలువైన సమయాన్ని వృధా చేయకుండా కఠోర సాధనపై దృష్టి సారిస్తే అనుకున్నది సాధించవచ్చు

యువత చెడు వ్యసనాలకు బానిస కావొద్దు: బెల్లంపల్లి ఏసీపీ మహేష్

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా తాళ్లగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలో బెల్లంపల్లి సబ్ డివిజన్
పోలీస్ ఆధ్వర్యంలో యువత భవిత అనే కార్యక్రమం బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏసీపీ బెల్లంపల్లి ఎడ్ల మహేష్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా
ఏసిపి ఎడ్ల మహేష్ మాట్లాడుతూ…..ఆధునిక కాలంలో వస్తున్న సాంకేతికతను ఉపయోగించుకుని ముందుకు సాగుతుండగా మరికొందరు లక్ష్యం లేకుండా సరదాలు, సెల్‌ఫోన్లకు, మద్యానికి, డ్రగ్స్‌కు అలవాటై తమ జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారు. యువత భవితవ్యం కోసం ఏర్పాటు చేసిన ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోని విజయం సాధించాలని, మీరు అనుకున్న లక్ష్యాలను సాధించానుకుంటే నిబద్ధత కఠోర సాధన చేయాల్సి వుంటుంది. ముఖ్యంగా ప్రణాళికబద్ధంగా చదవడం ద్వారా మీ కలలను సాధించుకోవచ్చని, యువత తమ సమయాన్ని వృధా చేయకుండా కఠోర సాధనపై దృష్టి సారిస్తే అనుకున్న ఉద్యోగాలను సాధింగలరని పాఠశాల , కళాశాల స్థాయిలోనే కొందరు విద్యార్థులు పెడదోవ పడుతుండగా , వయసుతో సంబంధం లేకుండా కొత్తదనపు అనుభూతి కోసం చెడు అలవాట్ల వైపు దారి మరలుతున్నారు. యువత అనవసరంగా చెడు అలవాట్లకు బానిసై భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు. యువత కి విద్య, ఉద్యోగ ఉపాధి లో పోలీసులు ఎల్లప్పుడూ పూర్తి సహకారం ఉంటుంది అన్నారు. త్వరలో జరుగబోయే పోలీస్ ఉద్యోగాల నియామకాల్లో ఈ ప్రాంతం నుండి ఎక్కువ సంఖ్యలో యువత పోలీస్ ఉద్యోగం లో సెలక్ట్ కావాలి. దానికి సంబందించిన పూర్తి శిక్షణ కి పోలీస్ సహకరిస్తుంది అని తెలిపారు.

ఈ సందర్భంగా షీ టీమ్ ఇంచార్జ్ ఎస్సై మాట్లాడుతూ…. ప్రస్తుతము సైబర్ నేరాలు పెరిగిపోవడం వల్ల ఇంట్లో తల్లిదండ్రులకు బంధువులకు సైబర్ నేరాల పై అవగాహన కల్పించాలని తెలిపారు. ఆన్లైన్ ఆర్థిక మోసానికి గురైన బాధితులు ఆలస్యం చేయకుండా 155260 లేదా డయల్ 100 కి కాల్ చేసి పోలీసువారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. తద్వారా పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందే అవకాశం కలదని తెలిపారు. చదువుకునే సమయంలో విద్యార్థులు ఒక గోల్ ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా చదువుకోవాలని, చదువుతో పాటు క్రమశిక్షణ కలిగి ఉండి తల్లిదండ్రులను, పెద్దలను, గురువులను గౌరవించాలని తెలిపారు. విద్యార్థులకు సైబర్ అవేర్నెస్, క్రమశిక్షణ, గోల్ ఏర్పాటు , లీడర్ షిప్ లక్షణాలు, సెల్ ఫోన్ వినియోగం వల్ల అనర్ధాలు, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, ఆన్లైన్ మోసాల గురించి, బాల్య వివాహాలు,షీ టీమ్ ఇంపార్టెన్స్, డయల్ 100 మొదలయిన విషయాలపై విద్యార్థుల కి వివరించారు. విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అని ఎవరైనా కొత్త వ్యక్తులు చెప్పే మాయమాటలకు మోసపోవద్దని ఎవరి పైన అయినా అనుమానం ఉన్నట్లయితే వెంటనే డయల్100 కి కాల్ చేస్తే పోలీసువారికి సమాచారం ఇవ్వాలని సూచించారు.షీ టీమ్ wtsapp నంబర్ 6303923700 కి తమ ఇబ్బందులను మెసేజ్ ద్వారా తెలుపవచ్చు అని సూచించారు.

ఈ కార్యక్రమంలో బెల్లం పల్లి రూరల్ ఇన్స్పెక్టర్ జగదీష్, బెల్లంపల్లి షీ టీమ్ ఇన్చార్జ్ ఎస్ఐ మానస,తాళ్లగురిజాల ఎస్ ఐ సమ్మయ్య ,గంగాధర్ కళాశాల ప్రిన్సిపల్ గోపాల్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు