రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: దర్గా ఉత్సవాలలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో హైదరాబాద్ చౌరస్తాలోని హజ్రత్ సొంటే పీర్ R A దర్గా గంధం ఊరేగింపు ఘనంగా భక్తిశ్రద్ధలతో, నిర్వహించారు. సొంటి పీర్ దర్గా ముత వల్లి మొహమ్మద్ ఇబ్రహీం ఖాద్రీబియబాని ఆధ్వర్యంలో జరిగిన గంధం ఊరేగింపు కార్యక్రమం లో ముత వల్లులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈద్గా నుండి ప్రారంభమైన గంధం ఊరేగింపు దర్గా వద్ద చేరుకున్న ముతవల్లులకు గంధానికి భక్తులు ఘనంగా పూలు చల్లుతూ స్వాగతం పలికారు. దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముతవల్లి మొహమ్మద్ ఇబ్రహీం ఖాద్రి బీయబాని మాట్లాడుతూ మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని హజరత్ సోంటే పీర్ r a ఆశీస్సులు ప్రజల పై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలంతా నీతి నియమాలు పాటిస్తూ పేద ప్రజల పై దయ చూపించి సమాజ అభివృద్ధికి పాటుపడే విధంగా కృషి చేయాలని కోరారు. దర్గాలు అభివృద్ధికి ప్రభుత్వం మరింతగా సహకరించి తోడ్పాటు అందించాలని మొహమ్మద్ ఇబ్రహీం ఖాద్రీ బియాబాని కోరారు. దర్గాల సంరక్షణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించి

ఇవ్వాలని కోరారు. ప్రతియేటా భువనగిరి పట్టణంలో ఘనంగా జరుగుతున్న గంధం ఊరేగింపు ఉర్సు ఉత్సవాలలో మతాలకు కులాలకు అతీతంగా ప్రజలంతా పాల్గొని ఎంతో ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం అని ఆనందం వ్యక్తం చేశారు. భువనగిరి పట్టణంలో జరిగే ఉర్సు ఉత్సవాలు ఇతర జిల్లాలకు ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ముతవల్లులు కాజా బషీరుద్దీన్, షేక్ మీరా, అమిన్, నజీర్, అయుబ్ ఖాద్రీ బియబాని, ఇంతియాజ్, తాహెర్, చోటే మియా, యూసుఫ్, తదితరులు పాల్గొన్నారు.