రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: భువనగిరి లోని స్థానిక ఖాజీ మొహల్లా ప్రాంతంలోని హజ్రత్ జమాల్-ఉల్-బహర్ పుణ్యక్షేత్రం వార్షిక ఉర్స్ షరీఫ్‌కు హాజరైన బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆయేషా నజ్ మెహదీ,ఈ సందర్బంగా వారు దర్గా లో చాదర్ ను సమర్పించారు.వారి వెంట మౌలానా అబ్దుల్ రషీద్ సాహిబ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు దూర ప్రాంతల నుండి మతాలకు అతీతంగా ప్రజలు ఉర్సు ఉత్సవాలలో పాల్గుని తమ ముక్కులను తీర్చుకుంటారు. మరియు హజ్రత్ జమాల్-ఉల్-బహర్ ఉర్సులో మత భేదాలు లేకుండా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు నిర్వహిస్తారని, భారతదేశం శాంతికి నిలయమని, ఇక్కడ అన్ని మతాల వారు తమ మతపరమైన పండుగలను ఉత్సాహంగా జరుపుకుంటారని అన్నారు.ఈ సందర్బంగా అదిల్, నూర్ సైఫుల్హా తదితరులు పాల్గున్నారు .