రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: కార్మికుల ప్రాథమిక హక్కులను భంగం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన 4 లేబర్ కోడ్ లను వెంటనే చేయాలని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ. ఎస్. బోస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏఐటీయూసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించారు. ముందుగా అనంతరం స్టేజి నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు సుమారు 1000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళాకారులు ధూమ్ దాం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వి. ఎస్. బోస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల అమ్మేసి ప్రైవేటు పరం చేస్తున్నారని, పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. నూతన లేబర్ కోడ్ల వలన కార్మికులు తమ సర్వ హక్కులను కోల్పోతున్నారని, సంఘం పెట్టుకొని హక్కు,వేతనాలు అడిగే హక్కు, సమ్మె చేసే ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
55 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి రూ.5 వేల పెన్షన్, ప్రమాదంలో మరణించిన వారికి రూ.10 లక్షలు, సహజ మరణానికి రూ.5లక్షలు ఇవ్వాలని, జిల్లా కేంద్రంలో ఆటో లకు పార్కింగ్ స్థలం కేటాయించాలని, భువనగిరి మరియు చౌటుప్పల్ లో సివిల్ సప్లై సొంత గోడౌన్ నిర్మించి,నూతన కూలి రేట్లు ఒప్పందం చేయాలని, మున్సిపల్ కార్మికులకు పదకొండవ పిఆర్సి లో జీవో నెంబర్ 60 ప్రకారం కేటగిరీల వారీగా జీతాలు చెల్లించాలని, యాదాద్రి కొండపై ఆటో లకు పార్కింగ్ స్థలాన్ని కేటాయించాలని, చిరు వ్యాపారులకు శాశ్వత దుకాణాలు కేటాయించాలని, మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల పెంపు జీవో నెంబర్ 21 అమలు చేయాలని, ప్రతి కార్మికునికి కనీస వేతనం ప్రతి కార్మికునికి రూ.24వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం,సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోరేటి రాములు,ఎండి ఇమ్రాన్, కూరెళ్ల మచ్చగిరి, గణబోయిన వెంకటేష్,ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు భూశపాక నరసింహ, చెక్క వెంకటేష్, సామల భాస్కర్, దాసరి లక్ష్మయ్య,చెరుకు నరసింహ,కొండమడుగు బాలయ్య,చొప్పరి సత్తయ్య,మన్సూర్ భాషా,పెరబోయిన స్వామి, ఎర్ర సిమోన్, ఉప్పలయ్య, పురుగుల మారయ్య,పాపగళ్ల శంకరయ్య, పల్లె శ్రీనివాసు, గొరిగే శంకరయ్య, మల్లేష్, అండాలు, ఐలమ్మ, లక్ష్మమ్మ,చంద్రకళ, చందు నాయక్,రాములు, ఆదిమూలం బాబు,జక్కుల రాములు, సత్తిబాబు,వెంకటేష్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.