రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: ఇంటర్ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని SFI జిల్లా అధ్యక్షుడు వనం రాజు, NSUI జిల్లా అధ్యక్షుడు మంగ ప్రవీణ్ AISF జిల్లా కన్వీనర్ ఉప్పల క్రాంతి కుమార్ అన్నారు . ఇంటర్ విద్యారులు పాఠాలు చెప్పకుండా పరీక్షలు పెట్టి రెండు లక్షల యాభై వేల మందిని ఫెయిల్ చేసిన ఇంటర్ బోర్డు విధానాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్ కళాశాల బంద్ సందర్బంగా భువనగిరి జిల్లా కేంద్రంలో SFI, AISF, NSU సంఘాల ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణాంగా జరిగింది. అనంతరం స్థానిక ప్రిన్స్ చౌరస్తాలో మోకాళ్ళ పై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మేధావులు,విద్యార్థి సంఘాల నాయకులు ముందుగానే చెప్పిన వినకుండా కార్పొరేట్ కళాశాలలకు తొత్తులుగా మారి బలవంతంగా పరీక్షలు పెట్టారు.కరోన మూలంగా పాఠాలు చెప్పకుండా పరీక్షలు పెట్టి విద్యార్థుల మరణాలకు కారణమయ్యారనిన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు కనీస పాస్ మార్కులు వేసి పాస్ చేయాలని, ఉచితంగా రీవల్యూవేషన్,ఇఫ్రూమెంట్ కు అవకాశం కల్పించాలని,ఇంటర్ బోర్డు కార్యదరి ని తొలిగించాలని,విద్యాశాఖ మంత్రి ని బర్తరాప్ చెయాలని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా కమిటీ సభ్యులు చింతల శివ,ఈర్ల రాహుల్, సందేల రాజేష్,SFIనాయకులు పల్లెర్ల సందీప్, నగరం శివ బుగ్గ ఉదయ్,NSUI జిల్లా కార్యదర్శి లు సురుపంగా చందు,పడాల శరత్,NSUIనాయకులుఏడుమేకల మహేష్,మసూద్,షరీఫ్,మణికంఠ, తేజ,దుర్గ ప్రసాద్. AISF జిల్లా కో కన్వీనర్ లుసురాం జానీ,అభిలాశ్ AiSF నాయకులు కుమ్మరి స్వామి,చరణ్,మనోహర్ మచ్చిగిరి,వికాస్ లు పాలుగొన్నారు