రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన కార్యాలయంలో (ఈ నెల) డిసెంబర్ 11నుండి – 22 వరకు నోయిడాలో జరుగుతున్న 59వ జాతీయ ఇన్ లైన్ రోలర్ స్కేటింగ్ సబ్ జూనియర్ ( 5 – 7 Age) విభాగంలో హైదరాబాద్ కు చెందిన కృష్ణ నిక్షిప్త్ (6 ఇయర్స్) బంగారు పతకం సాధించినందుకు అభినందించారు.

రాయల్ పోస్ట్ ప్రతినిధి హైద్రాబాద్: ఈ సందర్భంగా మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారు అందిస్తున్న ప్రోత్సాహం తో నేడు రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి వేదికలపై తమ సత్తా చాటి పతకాలు సాధిస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కు చెందిన క్రీడాకారుల పట్ల గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించరన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు. నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న తెలంగాణ క్రీడాకారులను గుర్తించి వారిని అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు మంత్రి శ్రీ V ఎం శ్రీనివాస్ గౌడ్ గారు. అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించి తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా తయారు చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో MLC కసిరెడ్డి నారాయణ రెడ్డి, నర్సింగ్, కోచ్ లు రాజ్, గిరి లు పాల్గొన్నారు.