రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ / యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి గ్రామంలో మోహన్ దాస్ గురు స్వామి ఆధ్వర్యంలో దేవరుప్పుల మల్లేశ్ గురుస్వామి గృహంలో 18 వ పాదం అయ్యప్ప స్వామి మహా పడి పూజను అంగరంగవైభవంగా నిర్వహించారు ఘనపతిపూజ, సుబ్రహ్మణ్యస్వామిపూజ,అమ్మవారిపూజ, మొదలైన అయ్యప్పస్వామి పూజలను నిర్వహించి హరి హర పుత్ర అయ్యప్ప స్వామికి 18 రకాల అభిషేకాలు నిర్వహించి పడిని వెలిగించారు అనంతరం అన్న దానం నిర్వహించారు దత్తాయపల్లి గ్రామం మొత్తం అయ్యప్పస్వామి నామస్మరణలతో మారు మోగింది అయ్యప్ప మాలాలు ధరించిన స్వాములు,భక్తులు,గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో స్వాములు,భక్తులు,పోతరాజు ఆగమల్లయ్య స్వామి,దేవరుప్పుల ఐలయ్య స్వామి,దానబోయిన కరుణాకర్ స్వామి,ఎర్రోజు భిక్షపతి స్వామి,దానబోయిన మల్లేశ్ స్వామి,గొప్ప దుర్గా రెడ్డి స్వామి,జిట్ట కిషన్ స్వామి,గాదె కృష్ణ స్వామి,మహేందర్ స్వామి,శ్రీకాంత్ రెడ్డి స్వామి, నర్సింహులు స్వామి, భాస్కర్ స్వామి, సాయి స్వామి తదితరులు పాల్గొన్నారు.